గతరాత్రి ఓ సంగీత దర్శకుడి బర్త్ డే పార్టీలో పాల్గొన్న పునీత్ రాజ్ కుమార్... వీడియో ఇదిగో!

  • పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత
  • గుండెపోటుకు గురైన నటుడు
  • తీవ్ర విషాదంలో కన్నడ ప్రజలు
  • రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం
ప్రముఖ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడ చిత్రసీమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 46 ఏళ్ల రాజ్ కుమార్ ఈ ఉదయం జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా తీవ్రమైన గుండెపోటుకు గురై, ఆసుపత్రిలో కన్నుమూశారు. కాగా, గతరాత్రి పునీత్ రాజ్ కుమార్ ఓ వేడుకలో పాల్గొన్నారు. కన్నడ సినీ సంగీత దర్శకుడు గురుకిరణ్ బర్త్ డే పార్టీలో పునీత్ కూడా సందడి చేశారు. ఈ పుట్టినరోజు సంబరంలో పునీత్ చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంగా కనిపించారు. కానీ అందరినీ విషాదంలో ముంచెత్తుతూ తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు.

కాగా, పునీత్ అంత్యక్రియలు ఆయన కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచనున్నారు. పునీత్ అంత్యక్రియలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయి.

Puneeth Raj Kumar
Gurukiran
Birthday Party

More Telugu News